ప్రధాని విదేశీ పర్యటన ఖర్చు 550 కోట్లు!
- 2026లోనే 74.58 కోట్లు
- రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి మార్గరిట
న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 నుంచి 2026 వరకు విదేశీ పర్యటనలకు రూ.550 కోట్లకు పైగా ఖర్చయిందని, 2026 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఖర్చు 74.58 కోట్లు దాటిందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిట తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానంగా గురువా రం రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2026 మే నెలలో ప్రధాని ఐదు దేశాల పర్యటన ఖర్చు అత్యధికంగా రూ.17.46 కోట్లయ్యింది.
ఆ సమయంలో ప్రధాని ఐదు దేశాల్లో పర్యటించారు. 2021లో రూ.36 కోట్లు, 2022లో రూ.55 కోట్లు, 2023లో రూ. 93 కోట్లు, 2024లో రూ.109 కోట్లు, 2025లో రూ.180 కోట్లకు పైగా అత్యధికంగా ఖర్చయింది. 2026కి సంబంధించిన గణాంకాలు తాత్కాలికమేనని, బిల్లుల ఖరారు తరువాత ఖర్చును కచ్చితంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా 2021 నుంచి ఇప్పటివరకు ప్రధాని విదేశీ పర్యటనల్లో 316 అవగాహన ఒప్పందాలు జరగగా, 2021 నుంచి 2025 వరకు జరిగిన ఒప్పందాల ఎఫ్‌డీఐ విలువ 381.8 బిలియన్ డాలర్లుగా ఉంది.






