calender_icon.png 23 July, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్‌పామ్ సాగుతో బంగారు భవిష్యత్తు

23-07-2025 12:21:43 AM

గద్వాల, జూలై 22 ( విజయక్రాంతి ) : బీచుపల్లి లోని టి.జి. ఆయిల్ ఫెడ్ నర్సరీ ఆవరణలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో టీ.జి.ఆయిల్ ఫెడ్ సహకారంతో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలలోని వివిధ క్షేత్ర స్థాయి అధికారులైన, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీలతో ఆయిల్ పామ్ పంటపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం. ఏ. అక్బర్, టీ.జీ.ఆయిల్ ఫెడ్ జిల్లా ఇంఛార్జి నాగిరెడ్డి పాల్గొన్నారు.ముఖ్యంగా ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి యం. ఎ. అక్బర్ డివిజనల్ ఉద్యాన అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ 2025- 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 3500 ఎకరాల ఆయిల్ పామ్ లక్ష్యంగా కేటాయించడం జరిగిందన్నారు.

ఈ లక్ష్యాన్ని ఉద్యాన శాఖ, టీ.జీ.ఆయిల్ ఫెడ్, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో పూర్తి చేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఆయిల్ పామ్ పంట అనేది ఒకసారి వేసుకుంటే 30 సంవత్సరాల వరకు రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుంది, చీడపీడల బెడద తక్కువ, అకాల వర్షాలకు వడగండ్లకు ఈ పంట ఎలాంటి నష్టం జరగదు, అంతర్ పంటలతో అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

అదేవిధంగా ఆయిల్ పామ్ చట్టం 1993 ప్రకారం ప్రతి నెల నిర్దేశించిన ధరకు కంపెనీ కొనుగోలు చేయడం జరుగుతుంది. నాణ్యమైన మొక్కలను ప్రభుత్వపరంగా రైతులకు కేవలం 20 రూపాయలకే అందజేయడం జరుగుతుంది, డ్రిప్పు సదుపాయం ఎస్సీ ఎస్టీ రైతులకు 100% ,సన్న చిన్న గారు రైతులకు 90%, పెద్ద రైతులకు 80% సబ్సిడీపై అందజేయడం జరుగుతుంది.

అదేవిధంగా పంట నిర్వహణకు 2100, అంతర పంటలకు 2100 ఇలా ఒక ఎకరానికి 4,200 ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇలా నాలుగు సంవత్సరాలకు గాను 16,800 రైతులు సబ్సిడీ ద్వారా పొందవచ్చు. రైతులకు ఎలాంటి మార్కెటింగ్ ఇబ్బంది కూడా ఉండదు. కావున రైతులు పెద్ద సంఖ్యలో ఈ ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలని క్షేత్ర స్థాయి అధికార్లకు కోరడం జరిగింది.