23-07-2025 01:08:45 AM
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే చరిత్రాత్మకమైనదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కొని యాడారు. కులగణన సర్వేకు అసెంబ్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చారని, అదేవిధంగా పార్లమెంట్‌లోనూ పార్టీలకు అతీతంగా బీసీ బిల్లుకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు.
కులగణన సర్వే అవసరం లేదన్న మోదీని జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని నిర్ణయం తీసుకు నేలా తెలంగాణ ప్రభుత్వం సర్వే పూర్తి చేసిందన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, లోక్ సభ, రాజ్యసభ ఎంపీ ల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీకి వెళ్తున్నామని తెలిపారు.
బీసీ బిల్లును త్వరితగతిన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి మద్దతు కూడగట్టడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఈ కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు కూడా కలిసివస్తారని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ర్టం అయినా కులగణన చేపట్టాలంటే తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వాన్ని అనుసరించాల్సిందేనని ధీమా వ్యక్తం చేశారు.
పారదర్శకంగా, పకడ్బందీగా సర్వే పూర్తి చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ర్ట ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రామచంద్రరావుకు దళితులు బీసీలు, మైనార్టీలు అంటే చిన్నచూపు ఉందని, దేశంలో ఈ వర్గాలకు మేలు జరుగుతుంటే ఆయన పదేపదే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్ర ల్ యూనివర్సిటీలో రాంచందర్‌రావు పాత్ర ఏంటో అందరికీ తెలు సని ఎద్దేవా చేశారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లు అనేది కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య అంశమని, రాజకీయ పార్టీలకు సంబంధించినది కాదన్నారు. భట్టి విక్రమార్క లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తి కాదని, సమయం వచ్చినప్పుడు పార్టీగా, వ్యక్తిగా లీగల్ నోటిస్‌కు ఎలా సమాధానం చెప్పా లో ఆ విధంగా చెబుతానని స్పష్టం చేశారు.
10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్లు అన్ని గాలికి వదిలేశారని, మాకు నిబద్ధత ఉంది కాబట్టి ప్రణాళికా ప్రకారం ముందు కు వెళుతున్నామని తెలిపారు. కార్పొరేషన్ల చైర్మన్‌ల నియామకంలో రా ష్ర్ట ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.