23-07-2025 12:20:20 AM
వైద్యాధికారి పుష్పలత
అనంతగిరి, జూలై 22 : సీజనల్ గా ప్రబలే వ్యాధుల పట్ల ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారి పుష్పలత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
వర్షాకాలం ప్రారంభం అయిన దృష్ట్యా సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, సీజన్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి దోమ నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌ఎన్ అనంతలక్ష్మి, ఉపేందర్, సూపర్వైజర్ ఉమామహేశ్వరి, యాతాకుల మధుబాబు సిబ్బంది పాల్గొన్నారు.