19-09-2025 01:07:13 AM
నల్లగొండ టౌన్ సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): నల్లండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రైతుల కోసం మంచి మనసు చాటుకున్నారు. తన కుమారుడి పెళ్లి రిసెప్షన్‌ను రద్దు చేసుకుని.. అందుకు ఖర్చు అయ్యే మొత్తం రూ.2 కోట్లతో తన నియోజకవర్గంలోని రైతులకు యూరియా అందించేందుకు ముందుకు వచ్చారు. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తాను ఉచితంగా అందించాలని నిర్ణయించుకుని గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి రూ.2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు.