19-09-2025 12:36:53 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న 3.38 కిలోల బంగారాన్ని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇస్త్రీపెట్టెలో తరలించేందుకు నిందితులు ప్రయత్నం చేయ గా.. అధికారులు పసిగట్టి పట్టుకున్నారు. బంగారంతోపాటు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకున్నట్లు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బంగారం రవాణాకు సంబంధించి ఎలాంటి ధ్రువపత్రాలు లేవని అధికారులు తేల్చారు. పట్టుబ డిన బంగారం విలువు దాదాపు రూ.3.36 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా బంగారం ధర ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తక్కువ ధరకు లంభించే దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసి.. ఇక్కడ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది.