27-09-2025 08:26:32 PM
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి..
టియుడబ్ల్యూజే(ఐజేయు) నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం చేసిన వనపర్తి శాసనసభ్యులు..
వనపర్తి టౌన్: స్వచ్ఛమైన జర్నలిజానికి నాంది పలకాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(MLA Thudi Megha Reddy) అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఐజేయు) వనపర్తి జిల్లా నూతన అధ్యక్షుడు డి మాధవరావు ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన జర్నలిజాన్ని ప్రజలకు అందించాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
నిజాయితీ నిబద్ధతతో వార్తలను సేకరించాలని ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛమైన జర్నలిజానికి నాంది పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నా కొండ యాదవ్, కమల్ రెహ్మాన్, సహాయ కార్యదర్శి చిన్న రాజు, కోశాధికారి మన్యం, జిల్లా కమిటీ సభ్యులు రమేష్, బాలరాజు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు చీర్ల ఆంజనేయులు సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ రాజ్, కోశాధికారి అరుణ్, సంయుక్త కార్యదర్శి ఈశ్వర్ సాగర్, ప్రచార కార్యదర్శి ముంత రవి, అలీమ్, ఫారుక్ పటేల్, ముక్తార్, విష్ణు, చంద్రమౌళి, మన్యం, జియా, నియోజకవర్గ ఉపాధ్యక్షులు దాచా హరీష్ కుమార్ పట్టణ అధ్యక్షుడు తైలం అరుణ్ రాజ్, ఉపాధ్యక్షులు మహేష్ సింగ్ సభ్యులు పాల్గొన్నారు.