27-09-2025 08:58:54 PM
ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) తెలిపారు. శనివారం పటాన్ చెరు పట్టణంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బాపూజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలను, ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని సొంత నిధులతో బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన రాజకీయ అవకాశాలు కావాలని కోరుకున్న వ్యక్తుల్లో ప్రథముడు బాపూజీ అని కొనియాడారు. తొలి దశ, మలి దశ తెలంగాణ పోరాటంలో బాపూజీ పాత్ర మరువలేనిదని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వంగరి అశోక్, కంకర సీనయ్య, వెంకటేష్, పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.