calender_icon.png 27 September, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉదృతంగా ప్రవహిస్తున్న మూసీ

27-09-2025 09:08:42 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఘట్ కేసర్ మండలం పరిధిలోని మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. గతంలో ఎప్పుడు కనపడని రీతిలో నది యధార్థంగా ప్రవహిస్తూ పరిసర ప్రాంతాలను ముంచేస్తుంది. కొర్రెముల, ఎదులాబాద్, ఘనపూర్, బాచారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎదులాబాద్ సమీపంలోని మూసీనది వంతెనను ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ ఎం. బాలస్వామి శనివారం సాయంత్రం సందర్శించి నీటి ఉదృతిని పరిశీలించారు. నది ఉదృతి తగ్గే వరకు ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని, అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు.