calender_icon.png 27 September, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిర్గాపూర్ లో ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంట్

27-09-2025 08:56:04 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఇందులో ముఖ్య అతిధిగా ఎస్సై మహేష్ పాల్గొని టాస్ వేసి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఇందులో గ్రామపెద్ద కళ్యాణ్ రావు పాటిల్, మాజీ ఎంపీటీసీ రాజకుమార్ స్థానిక సరస్వతి విగ్రహానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఎస్సై మహేష్ మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇందులో నర్సాగౌడ్, బాలరాజు, విట్టల్, సికిందర్ అలీ, సాయి, వినోద్, గిరి, అనిల్ గౌడ్, తదితరులు ఉన్నారు.