calender_icon.png 27 September, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనీస వేతన జీవో తక్షణమే విడుదల చేయాలి

27-09-2025 08:20:09 PM

కాలం చెల్లిన పాత టెండర్ల ఏజెన్సీలను రద్దు చేయాలి..

26 వేల కనీస వేతనంతో న్యూ టెండర్ పాలసీ ప్రకటించాలి..

అక్టోబర్ మొదటి వారంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముట్టడి..

తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్..

వనపర్తి టౌన్: 2012 సంవత్సరం నుండి ఇప్పటివరకు దాదాపు 13 సంవత్సరాలుగా పెరుగుతున్న ధరల అనుగుణంగా కొత్త కనీస వేతన జీవో విడుదలకు నోచుకోలేదని దీని ఫలితంగా కార్మిక వర్గం తీవ్రమైన ఆర్థిక శ్రమ దోపిడీకి గురవుతున్నారని లేబర్ జీవోలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ మొదటి వారంలో ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో చలో హైదరాబాద్ పేరిట లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని వందలాది ఆసుపత్రి కార్మికులతో ముట్టడిస్తామని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ హెచ్చరించారు. శనివారం వనపర్తి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పరిధిలోని మాత శిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల సమావేశం నిర్వహించి అనంతరం భోజన విరామ సమయంలో ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో శానిటరీ, భద్రత,రోగి సంరక్షణ నిర్వాణ కోసం ప్రభుత్వం ఐఎచ్ఎఫ్ఎంఎస్ మూడు సంవత్సరాల కాల వ్యవధితో టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసి ఏజెన్సీలను ఎంపిక చేసే విధానం రాష్ట్రంలో అమలవుతున్నదని ప్రస్తుతం నడుస్తున్న ఏజెన్సీ మూడు సంవత్సరాల కాల పరిమితి ముగిసిందని అన్నారు. కాలం చెల్లిన పాత ఏజెన్సీలను రద్దుచేసి తక్షణమే నూతన టెండర్ పాలసీ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో రెండు మూడు పర్యాయాలు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి న్యూ టెండర్ పాలసీ రూపొందించేందుకు ఆదేశాలు జారీ చేశారని అయితే వైద్యశాఖ అధికారులు రూపొందించే 2025 న్యూ టెండర్ పాలసీలో ఏజెన్సీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వ ఆకాంక్ష మేరకు కార్మికుల సంక్షేమం ఫరడ విల్లెల రూపొందించాలని సూచించారు. గత టెండర్ పాలసీలో అనేక అవకతవకలు ఉన్నాయని దాని ఆసరాగా చేసుకొని ఏజెన్సీ కాంట్రాక్టర్లు అవినీతి అధికారులు ఇష్టానుసారంగా కార్మికుల పొట్టలు కొట్టారని అన్నారు.

పుష్కరకాలం అవుతున్న కనీస వేతన జీవోలు సవరణకు నోచుకోలేదని లేబర్ చట్ట ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేబర్ జీవోలు సవరించి కార్మికులకు వేతనాలు ఇతర సౌకర్యాలు అందించాల్సి ఉంటుందని అన్నారు. ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 16 రోజులపాటు మిలిటెంట్ పోరాటాలు చేసిన నేపథ్యంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 2021 సంవత్సరంలో 21 కనీస వేతన జీవోను విడుదల చేసిన దొడ్డి దారిన అదే ప్రభుత్వం జీవో అమలు కాకుండా కుట్రలు పన్ని గెజిట్ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం మానవత దృక్పథంతో కాలయాపన లేకుండా తక్షణమే కనీస వేతన జీవోలు విడుదల చేసి ఆసుపత్రి కార్మికులకు 26 వేల వేతనం అందే విధంగా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసిహెచ్ ఆస్పత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు, కార్మికులు ఆనంద్, ఖదిర్, షారుక్, రాజు, వెంకటేష్, ఆంజనేయులు, భాగ్యమ్మ, బాలేశ్వరమ్మ, శాంతమ్మ, ప్రమిల, పెంటమ్మ, తిరుపతమ్మ, జయమ్మ, నాని, చిన్నమ్మ, పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.