27-09-2025 09:27:03 PM
రూ 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్..
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేశారు. మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఓ రైతుకు పశువుల పాక నిర్మాణానికి లక్ష రూపాయలు మంజూరు అయ్యాయి. మొదటి విడతలో 50 వేల బిల్లు మంజూరు కోసం ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ బానోతు దుర్గాప్రసాద్ రైతును బిల్లు సాక్షన్ కోసం పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడని ఆదిలాబాద్ ఏసీబీ డిఎస్పి మధు తెలిపారు. శనివారం రైతు వద్ద 10 వేల రూపాయలను దుర్గాప్రసాద్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు డిఎస్పి వివరించారు.దుర్గా ప్రసాద్ పై కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పర్చనున్నట్లు డిఎస్పి తెలిపారు.