calender_icon.png 27 September, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ కేటాయింపు

27-09-2025 09:19:11 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ ప్రక్రియను డ్రా పద్ధతిన నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారితో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిన స్థానాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 15 మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలకు స్థానాల కేటాయింపు రిజర్వేషన్ ప్రక్రియను డ్రా పద్ధతిన నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.