05-12-2025 01:54:52 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
తూకాలలో తేడాలు ఉంటే సహించేది లేదని హెచ్చరించిన డీసీఓ ప్రవీణ్
మోతె, డిసెంబర్04 : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకాలు ఎక్కువ వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మోసం.. దగా! శీర్షికన ’విజయక్రాంతి’లో ప్రచురితరమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం మండల పరిధిలోని నేరడవాయి గ్రామంలోని వడ్డెర గూడెంలో పి యస్ సి యస్ కొనుగోలు కేంద్రంను డి సి ఓ ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ధాన్యం రాశులు, కాంటాలను పరిశీలించాడు. కాంటలు వేసే చోట వసతుల గురించి నిర్వాహకులను, రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా మ్యాచర్ వచ్చిన దాన్యం మాత్రమే కాంటాలు వేయాలని , 41 కె జి ల లోపు మాత్రమే కాంటలు వేయాలని తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద రైతులకు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈయన వెంట సి ఇ ఓ ఉపేందర్, రైతులు ఉన్నారు.