calender_icon.png 1 July, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ఆత్మీయ వీడ్కోలు

01-07-2025 02:56:33 AM

-34 మంది పదవీ విరమణ

-హాజరైన కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసి పరిధిలో వివిధ కేటగిరీలలో పనిచేసిన 34 మంది సోమవారం పదవీ విరమణ పొందారు. జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సభను నిర్వహించి, వారిని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి తాము అందించిన సేవలతోనే గుర్తింపు లభిస్తుందని చెప్పారు.  పదవీ విరమణపొందుతున్న ఉద్యోగులందరూ తమ ఉద్యోగ జీవితంలో ఎంతో నిబద్ధత, అంకిత భావంతోసేవలందించారన్నారు.

రిటైర్మెంట్ పొందిన వారు వారి కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ, తమ ఆసక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్యంతో, ఆనందంగా గడపాలని సూచించారు. పదవీ విరమణ పొందిన వారిలో జకీర్ హుస్సేన్(సూపరింటెండెంట్ ఇంజనీర్), కె.క్రిష్ణ(గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్), వి.గోపి, కె.సత్యనారాయణ రావు, సూపరింటెండెంట్‌లు, రఘ, సీనియర్ అసిస్టెంట్, టి.రాజు, జూనియర్ అసిస్టెంట్, కె.చిత్తరి, పి.సత్యనారాయణ, ఆర్.యాదగిరి శానిటరీ జవాన్‌లు, ఎం. ఈశ్వర్, హెవీ వెహికిల్‌డ్రైవర్, ఎస్.రమేష్, కె.రఘు చౌకీదార్ లు, బి.రాం రెడ్డి, ఎలక్ట్రీషన్, పి.రాజయ్య, టి.అంజయ్య, కె.విజయ, లీలా భాయి, పి.యాదమ్మ పి.హెచ్ వర్కర్లు, ఎస్.సదానందం, రమేష్, కె.బాబు రావు, శ్రీనివాస్ కామాటిలు, కళావతి, శంకరమ్మ, కె.దుర్గమ్మ, శాహేదాభాను కామటన్ లు, జి.మల్లప్పవాచ్ మెన్, మహమ్మద్ ఆరీఫ్‌అలీ, మాలి, పి.యాదయ్య, పరశురాం మజ్దూర్ లు, బి.ఎస్.నర్సింగ్ రావు, పద్మ, జమోలమ్మ స్వీపర్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్, ఏఎంసి లు జీవన్ కుమార్ పాల్గొన్నారు.