calender_icon.png 1 July, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలస్థాయిలో ధరల నిర్ణయ కమిటీల ఏర్పాటు

01-07-2025 02:57:13 AM

  1. పెద్ద సంఖ్యలో ఇసుక విక్రయ కేంద్రాలు
  2. సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై నిత్యం సమీక్షలు
  3. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 30(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో సామాన్యులకు సిమెంటు, స్టీల్, ఇటుకలు, ఇసుక అందుబాటులో ఉండేందుకు మండ ల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు సమావేశమై ధరలు నిర్ణయించాలని డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవిన్యూ రిసోర్స్ మొబలైజేషన్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తొలుత గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిపై శాఖల వారీగా మంత్రుల బృందం సమీక్షించింది. ఈ నేపథ్యంలో రా ష్ర్టంలో 20 కేంద్రాల్లో ఇసుక విక్రయ కేంద్రా లు ఏర్పాటు చేసినట్టు అధికారులు వివరించారు.

కాగా మార్కెట్ యార్డులు, ప్రభుత్వ స్థలాల్లో త్వరితగతిన రాష్ర్ట వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని సబ్ కమిటీ స భ్యులు అధికారులకు సూచించారు. దీంతోపాటు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల బృందం చర్చించింది.

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భూముల బేసిక్ విలు వను పెంచితే దరఖాస్తుదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు మంత్రుల బృందానికి సూచించారు.  రాష్ర్ట ప్రజలపై పన్ను భారం మోపకుండా ఆదా యం పెంచే మార్గాలను అన్వేషించాలని భట్టి అధికారులను ఆదేశించారు. 

ప్రతిరోజు సమీక్ష..

రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ సబ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు. సబ్ కమిటీలో చర్చించిన విషయాల్లో ప్రగతి కనబరచాలని ఈ క్రమంలో అధికారులకు ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే తనతో నేరుగా సంప్రదించి ఫైళ్ల కదలికలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు.

హైదరాబాద్ నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే కార్యక్రమంపై, మైన్స్ జియాలజీ శాఖలో అమల్లో ఉన్న వన్ టైం సెటిల్మెంట్ ప్రగతిని సబ్ కమిటీ సభ్యులు సమీక్షించారు.  సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా,  కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, మైన్స్ అండ్ జియాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.