calender_icon.png 19 October, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయుల సేవలను గుర్తించి ఆత్మీయ సన్మానం..

19-10-2025 08:53:05 PM

తెలంగాణ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్..

చిట్యాల (విజయక్రాంతి): సమాజ సమస్యలను వెలుగులోకి తేవడంలో, ప్రజల గళాన్ని పాలకులకు వినిపించడంలో, నిజాన్ని నిష్పక్షపాతంగా అందించడంలో పాత్రికేయులు పోషిస్తున్న సేవలను గౌరవిస్తూ పత్రికా విలేకరులకు “ఆత్మీయ సన్మాన కార్యక్రమం”ను నిర్వహించి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కునూరు సంజయ్ దాస్ గౌడ్ - సాత్విక దంపతులు కూతురు క్లింకారతో కలిసి పాత్రికేయులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమం ద్వారా సమాజానికై కలం పట్టిన జర్నలిస్టుల కృషిని గుర్తించి, వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రజల కోసం కలం పట్టి నిజాన్ని వెలిబుచ్చే పాత్రికేయులు సమాజానికి మార్గదర్శకులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాటి మోహన్ రెడ్డి, మూడ వేణు  మెండే వెంకన్న యాదవ్, రేగొండ వేణుమాధవ్,  మూడ వెంకటాద్రి,  చెన్నోజు చంద్ర శేఖర్, గుడ్లపల్లి వెంకన్న, పోకల కరుణాకర్, చికిలం మెట్ల మెహర్ బాబు, చెరుపల్లి శ్రీనివాస్, కూనూరు మధుగౌడ్ పాల రాకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు