19-10-2025 09:03:27 PM
సూర్యాపేట (విజయక్రాంతి): పట్టణంలోని 16వ వార్డు, 44వ వార్డులకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, బీసీ మైనార్టీ నూర్ భాషా, ప్రధాన కార్యదర్శి జానీ భాయ్ ఆధ్వర్యంలో అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కొత్తగా చేరిన పార్టీ నాయకులకు మూడు రంగుల కండువా కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మెచ్చి పలు పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ జిల్లా నాయకులు మాశెట్టి ఉపేందర్, ఆకుల కిషోర్, తంగేళ్ల రాజేష్, కుమార్, లింగయ్య, రాంబాయి, సురభి సాయబి, షహనా, లక్ష్మమ్మ, విజయలతో మొత్తం వందమంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.