19-10-2025 10:34:54 PM
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు..
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..
కోదాడ: దీపాల కాంతులవలె తెలంగాణలోని ప్రతి ఇంటా వెలుగులు విరజిల్లాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోరారు. ఆదివారం పాత్రికేయులతో చరవాణిలో మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని తెలిపారు. తెలంగాణలో ప్రజల చీకట్లు తొలగిపోయి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజలకు అంతా మంచి జరుగుతుందన్నారు. తెలంగాణలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో విరజిల్లాలని ఆకాంక్షించారు. ప్రశాంత వాతావరణంలో దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రజలను కోరారు.