calender_icon.png 19 October, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేక్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు

19-10-2025 08:51:05 PM

•విద్యార్థి కుటుంబానికి తక్షణమే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

•కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.

•గురుకులలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థిని పరామర్శ

నంగునూరు: హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ గురుకులంలో అనుమానాస్పదంగా మృతిచెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి వివేక్ కుటుంబాన్ని ఆదివారం ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించి, ఆవేదన వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని విద్యార్థి అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోతే, ఇప్పటి వరకు మృతికి గల కారణాలు తెలుపకపోవడంపై ఆయన మండిపడ్డారు. వివేక్ తల్లిదండ్రులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్యతో ఫోన్‌లో మాట్లాడిన హరీశ్ రావు,తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన సంఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విచారణ చేపట్టకపోవడం పట్ల సీరియస్ అయ్యారు. విద్యార్థి కుటుంబానికి తక్షణమే ఎక్స్ గ్రేషియా ప్రకటించి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరామర్శ సందర్భంగా వివేక్ కుటుంబానికి హరీశ్ రావు ఆర్థిక సహాయాన్ని అందజేసి, వారికి మనోధైర్యాన్ని కల్పించి, అండగా ఉంటానని భరోసానిచ్చారు. తమ పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.