calender_icon.png 20 October, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ జిల్లాలో తహసిల్దార్ ల బదిలీలు

19-10-2025 10:29:04 PM

మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో తహసిల్దార్ లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. షామీర్పేట్ తహసిల్దార్ యాదగిరి రెడ్డిని కీసరకు బదిలీ చేయగా, షామీర్పేటలో నాయబ్ తహసిల్దార్ గా పనిచే స్తున్న సంయుక్తకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కలెక్టరేట్లో టీ సెక్షన్ లో పనిచేస్తున్న చంద్రశేఖర్ ను ఘట్కేసర్ తహసిల్దారుగా బదిలీ చేశారు. సీసీఎల్ ఏ లో పనిచేస్తున్న ఉష్ణ చైతన్యను మేడిపల్లి తహసిల్దార్ గా బదిలీ చేశారు. కీసర తహసిల్దార్ గా పనిచేసిన అశోక్ కుమార్ ను కుదుబుల్లాపూర్ కు, కలెక్టరేట్లో పని చేస్తున్న రాజశేఖర్ రెడ్డిని కాప్రాకు, సుచరితను మూడు చింతలపల్లికి బదిలీ చేశారు. సంబంధిత అధికారులు బాధ్యతలు స్వీకరించి కలెక్టరేట్లో రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.