19-10-2025 10:32:22 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ ఎన్జీవోస్ కాలనీ కె ఆర్ ఎం ఫంక్షన్ హాల్ లో ఆదివారం విశ్వబ్రాహ్మణ ఉన్నతికి పాటుపడాలని వారి అభివృద్ధికి సహకరించాలని, విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్, ప్రొఫెషనల్ అభ్యుదయ సంఘం, శ్రీరామోజు రాజ్ కుమార్ ప్రచార కార్యదర్శి ఆహ్వానం పలుకగా అధ్యక్షులు సిద్ధోజు విద్యాసాగర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని అనంతరం మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ పేద విద్యార్థులకు వివోపిఏఎస్ ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం, సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని కొనియాడారు. విశ్వబ్రాహ్మణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వారు ఉన్నతికి పాటుపడాలని వారి చదువులో తల్లిదండ్రులు కూడా సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి ప్రతిభ కనబరిచిన 23 విద్యార్థులకు, 6 ఇంటర్మీడియట్ విద్యార్థులకు క్యాష్ ప్రైస్, సర్టిఫికెట్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి దాసోజు గోవర్ధన చారి, పెందోట శ్రీనివాస్, డాక్టర్ కాగితపు, సురేందర్, కన్నేకంటి. వెంకటరమణ, పిన్నోజు సురేష్ బాబు, ఎర్రోజు బిక్షపతి, కార్యక్రమ నిర్వాహకులు కోశాధికారి వలబోజు కేశవరావు, సదానంద చారి, నరసింహ చారి, శ్రీధర్, కురోజు దేవేందర్, తంగళ్ళపల్లి జయసేన, ఎం. సదానంద చారి, సిహెచ్. రాజేందర్, ఎస్. సుధాకర్ రావు డాక్టర్. పూర్ణచందర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.