calender_icon.png 20 October, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలు ప్రారంభం

19-10-2025 09:07:02 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి సరస్వతి శిశుమందిర్ క్రీడా ప్రాంగణంలో రాష్ట్రస్థాయి ఇన్విటేషన్(సి హెచ్ శ్రీనివాస్ స్మారక) కబడ్డీ క్రీడలు ఆదివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమ నిర్వహణ సి హెచ్ రాజు (రాష్ట్ర కబడ్డీ సెక్రటరీ) చేశారు. సోమవారం సాయంత్రం ముగింపు కార్యక్రమం ఉంటుందని రాజు తెలిపారు. ప్రథమ స్థానం 20,000, ద్వితీయ స్థానం 10,000, తృతీయ స్థానం 5,000 రూపాయలు నగదు, వ్యక్తిగత బహుమతులు, షీల్డ్స్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి, సెక్రటరీ హీరాలాల్ కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.