19-10-2025 11:10:08 PM
రామగుండం అభివృద్ధికి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ నిరంతరం శ్రమిస్తున్నాడు..
రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని సినీ తారలకు మంచి గుర్తింపు ఉంటుంది..
గోదావరిఖని దీపావళి సంబరాల్లో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్..
గోదావరిఖని (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్లో సింగరేణి కార్మికులు భాగస్వాములు కావాలని, రామగుండం అభివృద్ధికి ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ నిరంతరం శ్రమిస్తున్నాడని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని సినీ తారలకు మంచి గుర్తింపు ఉంటుందని రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ లు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖనిలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆదివారం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి సంబరాల్లో మంత్రులు పాల్గొని మాట్లాడుతూ... సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సంస్థను లాభాల బాటలో తీసుకెళ్తున్నారని, సింగరేణిలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులకు కూడా ప్రభుత్వం గుర్తించి బోనాస్ కూడా ఇచ్చిందని గుర్తు చేశారు.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి రాజ్ ఠాగూర్ సింగరేణి ఎన్టీపీసీ జెన్కో సంస్థల సహకారంతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేస్తున్నారని, నా వృత్తి పనులకు ప్రజలు కూడా మద్దతు తెలుపడం ఎంతో సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతుగా కూడా సహకరిస్తామని మంత్రులు తెలిపారు. గోదావరిఖనిలోని నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ సంబరాల్లో జిఎం లలిత కుమార్, ఐఎన్టిసి నాయకులు జనక్ ప్రసాద్, ప్రభుత్వ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషనర్ మెంబర్ రామచందర్, సినీ నటుడు ఆలీ, శివారెడ్డి, రచ్చ రవి, తాగుబోతు రమేష్, హీరో సాగర్ తదితరులు పాల్గొన్నారు.