10-12-2025 07:32:13 PM
24 పంచాయతీ సర్పంచ్ పదవులకు 82 మంది పోటీ..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గ్రామాలలో సర్పంచుల ప్రచారం జోరుగా కోనసాగుతుంది. సుల్తానాబాద్ మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలకు గాను మూడు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 24 గ్రామ పంచాయతీల సర్పంచులకు గాను 82 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బుధవారం సుల్తానాబాద్ మండలంలోని గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు.. వార్డు సభ్యుల అభ్యర్థులు వారి వారి గెలుపు కోసం ఇంటింటా ప్రచారాలు నిర్వహిస్తూ... తమని గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు. మండలంలోని సుద్దాల, కనుకుల, తొగర్రాయి, మంచరామి, గట్టపల్లి, నీరుకుల్లా, కదంబపూర్ తో పాటు అన్ని గ్రామాల్లోనూ అభ్యర్థులు గ్రామాలలో ర్యాలీగా వెళ్తూ తమ గుర్తులకు సంబంధించి కరపత్రాలను అందజేస్తూ తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు.