11-12-2025 01:41:52 AM
ఏదీ మరియొకసారీ!
పాత ప్రతిపాదనలకు.. కొత్త ఒప్పందాలంటూ ప్రకటనలు
జెన్‌కో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఒప్పందాల్లో ఐదు పాతవే
సీఈఏ వెబ్‌సైట్లో ఐదు కంపెనీల పేర్లు..
ఐదు ప్రాజెక్టులకు 2020 నుంచి 2023 వరకు టీవోఆర్ జారీ
రూ. 45 వేల కోట్ల ప్రాజెక్టులంటూ.. సీఈఏ వెబ్‌సైట్‌లోని
పాత కంపెనీలు, ప్రాజెక్టులనే ప్రకటించిన వైనం

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి) : కొత్త సీసాలో పాత సారా..! రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు అచ్చుగుద్దినట్టుగా సరిపోయే సామెత ఇది. సోమ, మంగళవారాల్లో ఫ్యూచర్ సిటీలో ఎంతో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025లో భారీ ఒప్పందాలంటూ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసలు విష యాన్ని దాచిపెట్టింది..!
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులుగా పేర్కొన్న ఐదు ప్రాజెక్టులకు సంబంధించి 2020 నుంచి 2023 వర కు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్) జారీ చేసినట్టుగా సాక్షాత్తు సెంట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటీ తమ వెబ్‌సైట్‌లో ప్రకటించగా.. ఇప్పుడు అవే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం (తెలంగాణ జెన్‌కో) ప్రకటించడం విస్మయానికి గురిచేస్తోంది. అంటే.. పాత కంపెనీలతో.. పాత ప్రాజెక్టులకు సంబంధించి.. కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకు న్నట్టుగా ప్రకటించడం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైందంటూ విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్నారు.
వివరాలు సీఈఏ వెబ్‌సైట్‌లో..
దేశవ్యాప్తంగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి 2025 అక్టోబర్ 31 నాటికి అప్‌డేట్‌చేసిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. విద్యుత్తు రం గాన్ని ఎల్లవేళలా పర్యవేక్షించే సెంట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటీ (కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస-సీఈఏ) తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఇందులో తెలం గాణ రాష్ట్రానికి వచ్చేసరికి 5 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (పీఎస్‌పీ)లకు మొత్తం 7,150 మెగావాట్ల సామర్థ్యంతో అవకాశం ఉందని వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పొందుపర్చింది. ఈ ఐదు ప్రాజెక్టులు, వాటిని చేపట్టడానికి ముందుకు వచ్చిన ప్రైవేటు విద్యుత్తు కంపెనీలు, వాటికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్) జారీచేసిన తేదీలను కూడా వెబ్‌సైట్‌లో పొం దుపర్చడం గమనార్హం.
మక్కీకి మక్కీ దించారు..
సెంట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటీ వెబ్‌సైట్లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించిన జాబితాలో ఉన్నవాటినే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న ఒప్పందాలకు సంబంధించిన కంపెనీల జాబితా మక్కీకి మక్కీగా దిం చారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా.. 3,960 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టనున్నట్టు ప్రకటించిన గ్రీన్‌కో ఎనర్జీ ప్రై.లి. కంపెనీ యధాతథంగా సీఈఏ వెబ్‌సైట్‌లోనూ ఉంది. మిగతా కంపెనీలుకూడా అవే అయినప్పటికీ.. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని కాస్త అటూ ఇటూగా మార్చినట్టుగా కనపడుతోంది. అలాగే సీఈఏలో 750మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్టు డెవలపర్ ప్రాజెక్టు పేరు వెబ్‌సైట్‌లో గ్రీన్‌కో టీఎస్01గా పేర్కొనగా.. తాజా ఒప్పంద ప్రకట నలో గ్రీన్‌కో టీజీ01గా పేర్కొనడం గమనార్హం. గతంలో టీఎస్‌గా తెలంగాణ ప్రభు త్వం పేర్కొనగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత దానిని టీజీగా మార్చినట్టుగానే.. ఇక్కడ టీఎస్ స్థానంలో టీజీగా పేర్కొన్నట్టు చెప్పుకోవచ్చు.
పాతవే కొత్తగా..
సెంట్రల్ ఎలక్ట్రీసిటీ అథారిటీ (సీఈఏ) వెబ్‌సైట్‌లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కింద పేర్కొన్నవి, వాటి డెవలపర్లుగా గుర్తించిన కంపెనీలు.. అలాగే తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా ప్రకటించిన కంపెనీలు, ప్రాజెక్టుల జాబితాలను పరిశీలిస్తే.. పాతవాటినే మరోసారి కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఎవరికైనా అర్థం అవుతుంది. పంప్డ్ స్టోరేజీకి సంబంధించి సుమారు 7,460 మెగావాట్ల సామర్థ్యంతో సుమారు రూ. 45 వేల కోట్లకుపైగా పెట్టుబడులతో కంపెనీలు ఒప్పందం కుదుర్చు కున్నట్టుగా రెండు రోజుల క్రితం ప్రకటించారు.
అయితే సీఈఏ వెబ్‌సైట్‌లో 7,150 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేయను న్న 5 ప్రాజెక్టులకు సంబంధించి డెవలపర్లుగా పేర్కొన్న 5 కంపెనీలు ప్రస్తుతం ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు ఒకటే కావడం ఇక్కడ గమనార్హం. పాత కంపెనీలతోనే ఒప్ప ందం కుదుర్చుకుని ఇవి కొత్తగా వచ్చిన ఒప్పందాలు.. భారీ పెట్టుబడులంటూ ప్రభుత్వం ప్రకటిం చుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గతంలో కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలతో అంతర్గతంగా ఒప్పందాలు చేసుకుని..
ఇప్పుడు అంత ర్జాతీయ స్థాయి వేదికలపై మరోసారి కొత్త ఒప్పందాలంటూ ప్రక టించడం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలపై ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే.. మరోవంక రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాల్లో డొల్లతనం ఇలా బయటపడటంతో.. విద్యుత్తు శాఖలో ఏం జరుగుతుందనే అనుమానాలు విద్యుత్తు రంగ నిపుణుల్లోనూ రావడం గమనార్హం. ఇక ప్రజలు ఏమనుకుంటే మాకేంది.. అనేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటున్నారు.
ఎంవోయూ కుదుర్చుకునేముందు లోతుగా పరిశీలించి, విద్యుత్తు సంస్థల్లోని సీనియర్ ఉన్నతాధికారులతో మాట్లాడితే.. అసలు విష యం బయటకు వచ్చేదంటున్నారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమ పటాటోపా న్ని చూపడానికి ఇలా పాత కంపెనీలు, ప్రాజెక్టులపై కొత్త ఒప్పందాలంటూ ప్రకటించడం పై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతుండటం గమనార్హం. భారీ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలంటూ ప్రకటించే ముందు.. పరిశీలించి ఉంటే పాత, కొత్తల అసలు విషయం బోధపడేదని నిపుణుల అభిప్రాయం.
భారీ ప్రకటనలు..
తాజాగా దేశ, విదేశీ వ్యాపార, వాణి జ్యం కంపెనీల ప్రతినిధులు, యాజమాన్యా లు, ప్రముఖులతో అట్టహాసంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్-2025లో తెలంగాణ జెన్‌కోతో సుమారు 9 కంపెనీలు, అలాగే టీజీ రెడ్‌కోతో మరో 12 కంపెనీలు భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ప్రభు త్వం ప్రకటించింది. ఈ ఒప్పందాల వల్ల రూ. వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అలాగే భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇలా ప్రకటించిన వాటిలో తెలంగాణ జెన్‌కోతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిలో ముఖ్యమైన ఐదు కంపెనీలుకూడా సీఈఏ వెబ్‌సైట్లో సంవత్సరాల క్రితమే టీవోఆర్ జారీచేసి, డెవలపర్‌గా గుర్తించిన కంపెనీలే ఉండటం గమనార్హం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...