calender_icon.png 11 December, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించండి

10-12-2025 07:28:52 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఎన్నికల విధులలో పాల్గొంటున్న(సిబ్బంది) ఉపాధ్యాయులు అర్ధరాత్రి వరకు ఎన్నికల విధులలో పాల్గొంటారు కాబట్టి, మరుసటి రోజు విధులకు హాజరవడం కష్టంతో కూడిన పని. కావున ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించాలని ఎస్.టి.యు.టి.ఎస్ నిర్మల్ జిల్లా శాఖ జిల్లా(ఎన్నికల అధికారి) జిల్లా కలెక్టర్ కి ప్రాతినిధ్యం చేయగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎస్టియుటిఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, సారంగాపూర్ మండల అధ్యక్షులు మఠం పరమేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.