18-12-2025 12:00:00 AM
యువకుడు మృతి, మరొకరికి గాయాలు
ముషీరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన దోమలగూడ పోలీ స్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ట్యాంక్బండ్‌పై బుధవా రం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై ఇద్దరు స్నేహితులు ప్ర యాణిస్తుండగా మ ఖ్దూమ్ మొహియుద్దీన్ విగ్రహం ఎదురుగా లారీ (టీఎస్12 యూడీ1657) ని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ బైకును ఢీకొట్టడం తో బైక్ వెనకాలో కూర్చున్న కార్తిక్ (18) అనే యువకుడు తలకు తీవ్ర గా యాలై అక్కడికక్కడే మృ తి చెందాడు.
బైక్ నడిపిన రంజిత్ (19) దవా ఖానలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కార్తిక్ గుడిమల్కాపూర్కు చెందిన వ్యక్తి అని, వృత్తి రీత్యా కార్ షో వాషర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమా దానికి కారణమైన లారీ డ్రైవర్ మహమ్మద్ లీక్ మియా (58) ఫలక్ను మా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించి కేసు నమోదు చేశారు.