calender_icon.png 1 January, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి కొలం గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు

01-01-2026 01:18:54 AM

సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక కృషి: మాజీ ఎంపీ సోయం బాపూరావు

ఉట్నూర్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషితో రాష్ట్రంలోని ఆదిమ గిరిజన తెగ (పీవీటీజీ)లకు చెందిన గిరిజనులకు రూ. 5 లక్షలతో  ప్రతి ఒక్కరికి ఇంది రమ్మ ఇండ్లు మంజూరు చేశారని రాజ్ గోం డు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎం పీ సోయం బాపూరావు అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలోని పాటగూడ లోని కొలం గిరిజనులకు చలి నుండి రక్షణకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ... ఆదివాసుల శ్రేయోభిలాషి వరంగల్ జిల్లా మంగునూర్ ఏసీపీ వెంకటేష్ ఆధ్వర్యంలో చలి దుప్పట్లను రాజ్ గోండు సేవా సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని అన్నారు.

పిల్లలను కచ్చితంగా చదివించాలని, పిల్లలు చదువుకుంటే ఉన్నత స్థానాలకు వెళ్తారని  గుర్తు చేశారు. ప్రతి కుటుంబం నుండి బడి ఈడు పిల్లలను చదివించాలని కోరారు. ఈ గ్రామానికి పలుసార్లు వచ్చానని, తను ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశానని గుర్తు చేశా రు. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కృషితో ప్రతి కొలం గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరు అయ్యాయని అన్నారు. కొలం గిరిజనులకు మంజూ రైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని అటవీ శాఖ అధికారులు ఉమ్మడి జిల్లాలో 42 గ్రామాల్లో అడ్డుకుంటున్నారని, ఈ విషయాన్ని కొలం నాయకులను త్వరలో ఢిల్లీకి తీసుకువెళ్లి అటవీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించుట కృషి చేస్తానని సోయం బాపూరావు హామీ ఇచ్చారు.