calender_icon.png 1 January, 2026 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగంపై అవగాహన ఉండాలి

01-01-2026 01:17:41 AM

ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ సేవాభావంతో పనిచేయాలి: కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాం తి):  ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం స్థానిక బొక్క ల గూడలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు కాలనీ వాసులు డప్పుచప్పుళ్లతో ఘన స్వాగ తం పలకాగా, గ్రామ దేవతకు పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా వృద్ధులకు చేతికర్రలు, మంకీ క్యాపులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజలకు హక్కులు రాజ్యాంగం ద్వారానే లభిస్తున్నాయని తెలిపారు. విద్య ద్వారా గౌరవం లభిస్తుందని, విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు. ఆడపిల్లలకు ఎలాంటి పరిమితులు విధించకుండా తల్లిదండ్రులు వారి విద్య, భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సమాజంలో మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత చెడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటిపై జిల్లా యంత్రాంగం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ సేవాభావంతో పనిచేయాలని, మంచి పనుల ద్వారా సమాజంలో చిరస్థాయిగా నిలవాలని సూచించారు. గుట్కా వంటి క్యాన్సర్ కారకమైన చెడు అలవాట్లను విడిచిపెట్టి, ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ కొత్త సంవత్సరం నుండి మంచి తీర్మానాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్.ఐ అశోక్, ఎంఈవో సోమయ్య, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శశికాంత్, తోట విజయ్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవిదాస్, రెవెన్యూ సిబ్బంది ప్రకాష్, కాలనీ వాసులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.