calender_icon.png 12 January, 2026 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూరేండ్ల వ్యాసాశ్రమం

03-01-2026 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

వ్యాసాశ్రమానికి తెలంగాణకు సన్నిహిత సంబంధం ఉంది. నాకు తెలిసినంత వరకు మలయాళ స్వామి శిష్యులు, భక్తులు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నారు. గత సంవత్సరం వ్యాసాశ్రమం పక్షాన 98వ వేదాంత సభలు 3 రోజులు హైదరాబాద్‌లోనే ఘనంగా జరగడమే ఇందుకు ఉదాహరణ. నేను 1962లో ఏడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మా నాన్న బుచ్చయ్యగారి వెంట వ్యాసాశ్రమానికి వెళ్లా ను. నేను ఆశ్రమంలో అడుగుపెట్టిన నాటికి మలయాళ స్వాముల వారు సమాధి అయి వారం రోజులైంది. పూలతో అలంకరించిన వారి సమాధిని నేను కళ్లారా చూశాను. మలయాళ స్వామివారి ప్రత్యక్ష శిష్యులు మా స్వగ్రామంలో ఉండడం విశేషం. సరాబు 

లక్ష్మణ్ మావూరివాడే. గాంధీనగర్‌లోని మఠానికి సారథ్యం వహిస్తున్నాడు. వ్యాసాశ్రమానికి వెళ్లాలనే కోరిక బలీయమైంది. నాన్నగారితో వెళ్లిన తర్వాత అక్కడికి పోలేదు కాని వారి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. వ్యాసాశ్రమం ప్రచురించే ‘యథార్థభారతి’ మాసపత్రికకు నేను ‘మన ఉపనిషత్తులు -మానవ శ్రేయస్సు’ అనే పేరుతో ప్రతినెలా ఒక వ్యాసం అందిస్తున్నాను. ఇప్పటికి 9 ఉపనిషత్తులలోని విషయాలను సరళ సుబోధకంగా పాఠకులకందిస్తూ, అప్పుడప్పుడూ వారి ప్రశంసలకు పాత్రుడనయ్యాను. 

ఉపనిషత్తుల ప్రసంగం..

ఉపనిషత్తుల మీద నేను వ్రాస్తున్న ధారావాహిక వ్యాస పరంపరను గమనించిన పీఠాధిపతులు శ్రీపరిపూర్ణానందగిరిస్వామి నా చేత కృష్ణాజిల్లా కంకిపాడులోని గొడవ ర్రు గ్రామంలో ఉపనిషత్తుల మీద పదిరోజు లు ఉపన్యసింపజేశారు. అట్లే చిత్తూరు జిల్లాలోని శివగిరి క్షేత్రంలో పదిహేను రోజులు నాచేత ఉపనిషత్తుల మీద ప్రసంగింపజేశా రు. అనారోగ్య కారణాల వల్ల నేను శివగిరి క్షేత్రానికి రాలేనని చెప్పినప్పుడు, ‘నా భక్తులూరుకోరు. పైగా వారు నీ వ్యాసాలకు పాఠ కులు.

నీవు తప్పక రావలసిందే’ అని పరిపూర్ణానందగిరిస్వామి కోటి దీపోత్సవానికి హైద్రాబాదుకు వచ్చిన సందర్భంలో మా ఇంటికి వచ్చి మరీ నన్ను వెంట తీసుకొని వె ళ్లారు. ఒక ఆశ్రమాధిపతి, శ్రీ విద్యానందగిరి స్వామి శిష్యులైన పరిపూర్ణానందగిరి స్వామి మా ఇంటికి రావడమంటే అది మహాభాగ్యమనే చెప్పాలి. ఒక ముప్పది సంవత్సరాలు గా నేను ఉపనిషత్తుల మీద ఎన్నో వ్యాసాలు రాశాను. ‘మోక్ష సాధనలో దశోపనిషత్తులు’ అనే పేరుతో 2 పుస్తకాలను వెలువరించాను.

ఇప్పటిదాకా 9 ఉపనిషత్ సప్తాహాలను నిర్వహించాను. ఉపనిషత్తుల మీద నాకు గల ప్రేమనే పరిపూర్ణానందుల వారికి నా మీద అభిమానం కలగడానికి కారణం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికానుబంధం అంటే ఇదే. 1926లో స్థాపించబడిన వ్యాసాశ్రమానికి 2026 సంవత్సరానికి నూరేళ్లు పూర్తి అ వుతున్నాయి.

ఆశ్రమం స్థాపింపబడిన సంవత్సరం మొదలుకొని ఈ 2025 మార్చిలో బొంబాయి నగరంలో జరిగినంత వరకు భారతదేశంలోని వివిధ నగరాల్లో, ప్రాంతా ల్లో 99 సనాతనవేదాంత జ్ఞాన మహాసభలు ఘనంగా నిర్వహించబడ్డాయి. నేను స్వయం గా ఉయ్యూరు, రాజమండ్రి, హైద్రాబాద్‌లోని -బాలాపూర్, ముంబై నగరాల్లో జరిగిన వేదాంత జ్ఞాన మహాసభల్లో పాల్గొని ఉపనిషత్తుల మీద ప్రసంగించాను.

ఉచిత భోజనం..

మానవ సంస్కృతికి వేదాల తర్వాత పట్టుగొమ్మలుగా నిల్చినవి ఉపనిషత్తులే. ఆదిశంకరులు దశోపనిషత్తులను గుర్తించా రు. వాటినే తర్వాతి వారు సనాతన విజ్ఞానానికి ప్రమాణాలుగా తీసుకోవడం గమనా ర్హం. ఒక సంస్థ స్థాపించబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే గాక, వేదాంత సభలను నూరేళ్లుగా నిర్వహించడం ఏంతో గొప్ప విషయం. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతా ల్లో ఈరోజు కనిపిస్తున్న విద్వాంసులు, సం న్యాస దీక్ష తీసుకున్నవారు, ఆయా ఆశ్రమాలను స్థాపించి నిర్వహిస్తున్న వారు వందలమంది తాము వ్యాసాశ్రమంలో చదువుకు న్నామని చెప్పినప్పుడు నాకెంతో ఆశ్చర్యం కలిగింది.

ఎక్కడి కేరళ రాష్ర్టం? ఎక్క డి గురువాయూరు పుణ్యక్షేత్రం? అక్కడ 1885లో జన్మించిన మలయాళస్వామి వా రు తిరుమలకు విచ్చేసి కొండమీది గోగర్భతీర్థంలో 13 సంవత్సరాలు తపస్సుచేసి, ఆ త్మ సాక్షాత్కారాన్ని పొంది, 1926లో తిరుపతి, -కాళహస్తి పుణ్యక్షేత్రాల మధ్య గల ఏర్పేడు గ్రామం సమీపంలో వ్యాసాశ్రమాన్ని స్థాపించడం తెలుగువారికి ఒక విధంగా జ్ఞానభిక్ష పెట్టడానికేనని భావించవచ్చు. వ్యాసాశ్రమం అందరిది. స్త్రీలకు, శూద్రులకు కూడా సంస్కృతం, వేదాంత విద్య ఇక్కడ నేర్పబడుతుంది.

ఎందరో అనాథలు, గృహత్యాగం చేసినవారు, భగవద్భక్తికి అంకితమైనవారు, సనాతనధర్మం పట్ల అపేక్ష కలిగిన వారు ఈ ఆశ్రమంలో చేరి కృతార్థులయ్యారు. ఈ ఆశ్రమానికి విరాళాలిచ్చిన వారు ధన్యులు. వేలాది మంది విద్యార్థులకు ఉచితంగా భోజనంతో పాటు విద్య లభించడం ఇక్కడి ప్రత్యేకత. మలయాళస్వాముల వారు వ్యాసాశ్రమ సంస్థాపకులు కాగా, వరుసగా వారి శిష్యులు విమలానందగిరిస్వామి, 

విద్యానందగిరిస్వామి, పరిపూర్ణానందగిరిస్వామి పీఠాధిపతులుగా ఆశ్రమాన్ని సనాత నధర్మ ప్రచార కేంద్రంగా అన్నివిధాలుగా అభివృద్ధి పరిచారు.

70 ఏళ్ల వయసులో అదృష్టం..

విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా ఉన్న నాకు ఉపనిషత్తుల మీద అభిరుచి కలగడం, తద్వారా వ్యాసాశ్రమంతో అనుబంధం ఏర్పడింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమం టే, వ్యాసాశ్రమాన్ని ఎప్పుడు చూద్దామన్నా వీలు పడలేదు. కాని ఆ అదృష్టం నా 70 ఏళ్ల వయస్సులో కలగడం చిత్రమనిపిస్తుం ది. తిరుపతికి సుమారు 30 కి.మీ దూరంలో ని వ్యాసాశ్రమానికి 2025 మే నెలలో వెళ్లే అవకాశం లభించింది. వెళ్లినరోజు పరిపూర్ణానందస్వామి, అసంగానందస్వామి పనిమీద బయటికి వెళ్లారు. కాని కఠోపనిషత్తులోని నచికేతునలాగా ఉపావాసం చేయలేదు. ఆశ్రమవ్యాసులు నాకు మంచి ఆతిథ్యాన్ని అందించారు. నేను వైద్యాచార్య సత్యనారాయణతో కలిసి పీఠాధిపతుల మందిరాలను, మ్యూజియాన్ని దర్శించాను. కాశిబుగ్గను 

(ఎప్పటికీ నీరు తగ్గని కొలను) చూశాను. మలయాళ స్వాముల వారు తమ జీవితకాలంలో స్వయంగా నాటిన విత్తనం పేరు ఎవ రికీ తెలియదు. కాని అది మహావృక్షమై, మ లయాళస్వామి వృక్షంగా పిలువబడుతుంది. దానికి ఎదురుగా ఒక రాగి చెట్టుంది. దానికి గల కొమ్మలను చూస్తే సహస్రపాదుడైన విష్ణుమూర్తి గుర్తుకువస్తాడు. ఆశ్రమంలో ఏ శ్రమ లేకుండా ఒకపూట ఉన్నాను. హైదరాబాదుకు తిరిగి ప్రయాణమైన సమయంలో పీఠాధిపతుల దర్శనమైంది. ‘మీరు వ్యాసాశ్రమంలో జరిగే శతాబ్ధి ఉత్సవాల్లో 7 రోజు లూ ఇక్కడే ఉండాలి’ అన్న మాటలతో ఆశ్రమం నుంచి బయటపడ్డాను.

 వ్యాసకర్త సెల్: 98856 54381