02-07-2025 06:54:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యానికేతన్ ఒలంపియాడ్ పాఠశాల(Sri Vidyanikethan Olympiad School)లో ఆషాడ మాసం గోరింటాకు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడడంతో వాతావరణం చల్లగా మారుతుందన్నారు. ఈ క్రమంలో సూక్ష్మక్రిములు చేతులకు అంటుకొని అంటు రోగాలు వ్యాపించే క్రమంలో గోరింటాకు పెట్టుకుంటే అంటు రోగాలు దరిచేరవని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.