calender_icon.png 3 July, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుమ్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన జిల్లా కలెక్టర్

02-07-2025 06:14:29 PM

చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండి మండలం(Choppadandi Mandal) గుమ్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) బుధవారం సందర్శించారు. ఓపి రికార్డును తనిఖీ చేశారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడుతూ... ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల ఆధార్, ఫోన్ నెంబర్ సేకరించి నూరు శాతం ఆయుష్మాన్ భారత్ లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని అన్నారు. బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మాత్రలు నిరంతరం అందుబాటులో ఉంచాలని అన్నారు. మహిళలకు మల్టీ విటమిన్ టాబ్లెట్లు, క్యాల్షియం ఐరన్ మాత్రలు ఇవ్వాలని సూచించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షల బోర్డును కేంద్రంలో ప్రదర్శించాలని సూచించారు. శుక్రవారం సభలో సేకరిస్తున్న గ్రామస్తుల ఆరోగ్య వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రదర్శించాలని అన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నందున వన మహోత్సవంలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిత, కోఆర్డినేటర్ సనా పాల్గొన్నారు.