calender_icon.png 3 July, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ పశువుల రవాణా ఆగేనా

02-07-2025 07:06:57 PM

పైకి కూరగాయాల ట్రెలు లోపల పశువులను దాచి అక్రమంగా డీసీఏంలో తరలింపు..

కూరగాయాల మాటున అక్రమ పశువుల రవాణా చేస్తున్న అక్రమార్కులు..

అందులో కొన్ని పశువులు మృతిచెంది ఉన్నట్లు సమాచారం.. 

ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) ఏటూరునాగారం మండల కేంద్రంలోని అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద పైకి కూరగాయాల ట్రెలు కనిపించేలా లోపల పశువులను దాచి అక్రమంగా డీసీఏంలో తరలిస్తున్న వాహనం పట్టుబడింది. ఈ డీసీఏం వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తు పైకి మాత్రం చూసే వారికి అనుమానం రాకుండా కూరగాయాల ట్రెలు తరలిస్తున్నట్లు కనిపించేలా అమర్చి పశువులను అక్రమంగా తరలిస్తున్నారు.

ఈ క్రమంలోనే బుధవారం రోజున ఉదయం సమయంలో పశువులను అక్రమంగా తరలిస్తున్న డీసీఏం వాహనం ఏటూరునాగారం అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద అపకుండా వేగంగా ముందుకు వెళ్లడంతో అనుమానం వచ్చిన అటవీ శాఖ అధికారులు వాహనాన్ని వెంబడించి జాతీయ రహదారి పోతు రాజు బోరు వద్ద పట్టుకుని చూడగా అందులో పశువులను అక్రమంగా తరలిస్తుండడం గుర్తించారు. పట్టుబడిన డీసీఏం వాహనంలో సుమారు 50 వరకు పశువులను ఉన్నట్లు వారు గుర్తించారు. అందులో కొన్ని మృతి చెంది ఉన్నట్లు అటవీ శాఖ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం. కాగా పట్టుబడిన వాహనాన్ని ఏటూరునాగారం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేయడం జరిగింది. పశువులను అక్రమంగా తరలిస్తున్న వారి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలనుంది.

అదే పని ఇదే విధానం ఇది రెండో సారి పట్టుబడడం..

పశువులను కూరగాయాల ట్రెల మాటున తరలిస్తూ మండల కేంద్రంలో పట్టుబడడం గడిచిన రెండు నెలలో ఇది రెండవ సారి. ఈ సంవత్సరం మే 30వ తేదిన కూరగాయాల ట్రెల మాటున పశువులను డీసీఏంలో తరలిస్తుండగా ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ సమీపంలో పోలిసులు పట్టుకున్నారు. మళ్లీ ఈ నెల(జూలై) 2వ తేదిన ఉదయం సమయంలో ఇదే తరహలో పశువులను అక్రమంగా తరలిస్తుండగా ఏటూరునాగారం చెక్పోస్ట్ సమీపంలో అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.