calender_icon.png 3 July, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అందుబాటులో యూరియా

02-07-2025 06:51:46 PM

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలం అనంతారం (నారాయణ గూడె )పిఎసిఎస్ కార్యాలయంలో యూరియా రైతులకు అందుబాటులో ఉన్నట్లు రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సీఈఓ ఆలకుంట్ల సైదులు(CEO Alakuntla Saidulu) బుధవారం ఓ ప్రకటన తెలిపారు. ఎకరం భూమి ఉన్న రైతుకు యూరియా మూడు పర్యాయులుగా ఒక్కొక్క బస్తా అందజేయున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తిగల రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. అనంతారం కార్యాలయం పరిధిలో ఉన్న పొట్లపహాడ్, అనంతారం, మహ్మదాపురం, సింగిరెడ్డిపాలెం గ్రామాలు, అలాగే నారాయణ గూడెం కార్యాలయం పరిధిలో ఉన్న అన్నారం, దోస పహాడ్, నారాయణ గూడెం, అనాజిపురం గ్రామ రైతులు ఆయా కార్యాలయంలోనే యూరియా పొందగలరని కోరారు.