calender_icon.png 3 July, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూరారంలో కారు బీభత్సం..

02-07-2025 06:40:20 PM

చెరువులోకి దూసుకెళ్లిన ఇన్నోవ కారు..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): సూరారం పోలీస్ స్టేషన్(Suraram Police Station) పరిధిలో బుధవారం ఓ కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకువచ్చిన ఇన్నోవ కారు (TS 08 JS 6336) అదుపుతప్పి కట్ట మైసమ్మ చెరువు మూలమలుపు వద్ద చెరువులోకి దూసుకెళ్ళింది. దీంతో బతుకమ్మ పాండ్ కు వేసిన ఇనుప కంచె ధ్వంసం అయ్యింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పారారయ్యారు. స్థానికంగా ఉండే నాయకులు గుట్టు చప్పుడు కాకుండా క్రేన్ సహాయంతో హుటాహుటిన కారును చెరువులో నుండి తీసి, కారు నెంబర్ ప్లేటును తొలగించి అక్కడి నుండి తరలించారు. అయితే ఆ కారు స్థానికంగా ఉండే ఓ వ్యాపారావేత్తదని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.