calender_icon.png 1 January, 2026 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులి బాబోయ్ పులి

01-01-2026 12:55:13 AM

సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో తిరుగుతున్న పెద్ద పులి

కరీంనగర్, డిసెంబర్ 31(విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపిన పులి సంచా రం మంగళవారం కరీంనగర్ రూరల్ మండ లం వారిని, బుధవారం చొప్పదండి మండలంలోని వెదురుగట్ట, రుక్మాపూర్ గ్రామాల్లో సం చరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొనదంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. కరీంనగర్ రూరల్ మండలం చర్లబూత్కుర్, కొండాపూర్ ఐత్రాచుపల్లి చమనపల్లి, బహద్దూర్ ఖాన్‌పేట గ్రామాల్లో పులి సందర్శించినట్లు అధికారులు గుర్తించారు.

స్థానికులు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి పరిశీలించారు. వెదురుగట్ట శివారులోని పంట పొలా ల్లో పెద్దపులి తిరిగిందని ధ్రవీకరించారు. మంగళవారం రాత్రి రుక్మాపూర్‌లో సైతం పొలం గట్లపై ఉన్న పాద ముద్రలను ఎఫ్‌ఆర్‌వో శాకత్ హుసేన్, చొప్పదండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ తోపాటు సిబ్బంది పరిశీలిం చారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వెదురుగట్ట, రుక్మాపూర్ గ్రామా ల్లో పెద్దపులి సంచరిస్తుందని రైతులు తమ పంట పొలాల వద్ద పశువులను కట్టేందుకు బదులుగా ఇంటికి తీసుకురావాలని సూచించారు గ్రామాల ప్రజలు ఒంటరిగా వెళ్లరాదని, ఎటు వెళ్లినా నలుగురైదుగురు కలిసి వెళ్లాలని సూచించారు.