01-01-2026 12:55:09 AM
లాలాగుడా ఎస్పీ కార్యాలయంలో జీఆర్పి వార్షిక సమీక్ష వివరాలు రైల్వే ఎస్పీ చందనా దీప్తి
సికింద్రాబాద్, డిసెంబర్ 31 (విజయ్‌క్రాంతి) : ప్రయాణికుల భద్రతతో పాటు నేరాల నియంత్రణకై జీఆర్పీ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా మని రైల్వే ఎస్సీ చందన దీప్తి పేర్కొన్నారు. లాలాగూడలోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో జీఆర్పి వార్షిక సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025వ సంవత్సరంలో జీఆర్పీ పరిధిలో జరిగిన క్రైమ్‌లు, రికవరీలు, నేరస్థుల అరెస్ట్‌లు, మరణాలకు సంబంధిం చి వివరాలు వెల్లడించారు.
నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు జీఆర్పీ పోలీసులు ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో ముందు కు సాగుతున్నామని తెలిపారు. ప్రాపర్టీ నేరా లు, ఎన్డీపీఎస్ యాక్ట్, మొబైల్ ఫోన్ల చోరీ, కిడ్నాప్ లు తదితర నేరాలు జరుగకుండా నిఘా మరింత ముమ్మరం చేసినట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికులు కూడా పోలీ సులు అందించే సూచనలు పాటిస్తూ, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రయాణా లు సాఫీగా సాగేలా చూసుకోవాలని సూచించారు. ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
మొబైల్ ఫోన్ల రికవరీ
రైల్వే పోలీస్ డిస్ట్రిక్ట్ సికింద్రాబాద్లో 2023వ సంవత్సరం నవంబర్ నెల నుంచి ఇప్పటి వరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1,322 సెల్ ఫోన్ లు గుర్తించి సంబంధిత యజమానులకు అందజేశారు. కేవలం 2025 సంవత్సరంలో 572 సెల్ ఫోన్ లను రికవరీ చేసి యజమానులకు అప్పగించారని వెల్లడించారు.
ఎన్టీపీఎస్ యాక్ట్ కేసులు
ఎన్టీపీఎస్ యాక్ట్ కేసులు 2025 సంవత్సరంలో 54 కేసులు నమోదయ్యాయి. అందు లో 70 మంది నింధితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2.04 కోట్ల విలువగల 817 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నింధితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అదే విధంగా సుమారు రూ. 5కోట్ల విలువగల 2,010 కిలోల గంజాయిని పోలీసులు బాయిలర్ల ద్వారా తగలబెట్టారు.
మరణాలు
సికింద్రాబాద్ జిల్లా ఆర్పీ పరిధిలో 2025 సంవత్సరంలో డెత్ కేసులు తగ్గినట్టు వెల్లడించారు. రైలు ప్రమాదంలో మరణించిన వా రు, రైలు కిందపడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు, సహజ మరణం చెందిన వారు మొ త్తం 1,245 ఉన్నారు. అందులో గుర్తు తెలిసిన వాళ్లు 1,058 మంది. గుర్తు తెలియని వాళ్లు 189 మంది ఉన్నట్లు తెలిపారు.
చిల్డ్రన్స్ రెస్క్యూ
ఆపరేషన్ స్త్మ్రల్ అండ్ ముస్కాన్లో భాగంగా ఈ సారి 425 మంది బాలురు, 75 మంది బాలికలు, మొత్తంగా 500 మందిని రెస్క్యూ చేసి సీడబ్ల్యూసీలోని రిహ్యాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు.
ప్రాపర్టీ అఫెన్స్ కేసులు
2025 సంవత్సరంలో 1,034 ప్రాపర్టీ అఫెన్స్ కేసులు నమోదైయ్యాయి. అందులో 27.50 శాతం కేసులు ఛేదించారు. మొత్తంగా రూ.4.90 కోట్ల ప్రాపర్టీ లాస్ట్ కాగా, అందులో 9.65శాతం రికవరీ చేశారు ఈ సమావేశంలో రైల్వే డీఎస్పీలు ఎస్.ఎన్. జావెద్ (అర్బన్) శ్రీనివాసరావు(రూరల్), ఇన్స్పెక్టర్లు సాయి ఈశ్వర్ గౌడ్, ఆర్.ఎల్లప్ప, భాదర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు..