01-01-2026 12:56:38 AM
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్ క్రైం, డిసెంబరు 31 (విజయ క్రాంతి): గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ మేము ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను 80% వరకు అమలు చేస్తున్నామని క రీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వై ద్యులు అంజన్ కుమార్ తో పాటు పలువురు నాయకులతో కలిసి డిసిసి కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలందరికీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయా ణం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, రెండు లక్షల రైతు రుణమాఫీ, గతంలో 500 రైతు భరోసా ఇస్తే 1000 రూపాయలు అదనంగా చేసి రైతు భరోసా ఇచ్చి రైతు లకు అండగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు.
తెలంగాణ ఉద్యమంలో భాగం గా నీళ్లు నిధులు నియామకాలలో అన్యా యం జరుగుతుందని చెప్పిన కేసీఆర్ వారి పాలనలో వీటి అమలు విషయం విస్మరించినప్పటికీ మేము అధికారంలోకి వచ్చిన కొ ద్దిరోజుల్లోనే 60 వేల ఉద్యోగ నియామకా లు చేపట్టి నిరుద్యోగులను ఆదుకుంది మా కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. పదేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందజేయడంతో పాటు ధనవంతులు శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని అందజేసి ప్రతి పేదవాడి కడుపు నింపుతున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేయడం జరిగిందన్నారు.
ఇందులో 80 శాతానికి పైగా నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు కూడా చేసుకున్నారని అన్నారు. కెసి ఆర్ లాంటి దౌర్భాగ్యపు మాజీ ముఖ్యమం త్రి, ప్రతిపక్ష నేత ఈ దేశంలో ఎక్కడ ఉండరని అన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పల్లెలన్నీ కాంగ్రెస్ పార్టీ వైపే తీర్పునిచ్చాయన్నారు. మరో ఒకటి రెం డు మాసాలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పల్లెల్లో ఇచ్చిన తీర్పు కంటే రెట్టింపుగా మాకు అనుకూలంగా ఫలితాలు రానున్నాయని, తెలంగాణలో మెజారిటీ మున్సిపల్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని, ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని, జి ల్లాలో మెజారిటీ మున్సిపల్ స్థానాలను కాం గ్రెస్ పార్టీ గెలవబోతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ము ఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి కొండగ ట్టు అంజన్న మీ ఆరాధ్య దైవమని, ఈ దేవాలయానికి మీరు కొంత సహాయం చే యాలని కోరడంతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లకు నేను లేఖలు రాయడం, దానికి అనుగుణంగా ప్రయత్నాలు చేయడం ద్వారా కొంత ఆలస్యమైనప్పటికీ పవన్ కళ్యా ణ్ స్పందించి దాదాపు 36 కోట్ల రూపాయ లు కొండగట్టు ఆలయానికి కేటాయించార ని, 100 గదుల వసతి గృహంతో పాటు మాల విరమణ మండపం కట్టిస్తామని హా మీ ఇచ్చారని తెలిపారు.
చొప్పదండి నియోజకవర్గం ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ కు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజే స్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండి తాజ్, బానోతు శ్రావణ్ నా యక్, కొరివి అ రుణ్ కుమార్, పురం రాజే శం, ముత్యం శం కర్ గౌడ్, పత్తి మధుకర్ రెడ్డి, వెన్నం రజిత రెడ్డి, పంజాల కృపాసాగర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, దన్ను సింగ్, రోళ్ల సతీష్, మిరాజ్, మహేష్ పాల్గొన్నారు.