5 May, 2026 | 1:55 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

ఉద్యమకారులకు చట్టబద్ధమైన కమిటీ వేయాలి

13-03-2026 12:00 AM

తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక

ముషీరాబాద్, మార్చి 12(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల అంశం లో ప్రభుత్వం వెంటనే చట్టబద్దమైన కమిటీ వేయాలని తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేసింది. ఈ కమిటీకి ఆరు నెలల కాల పరిమితి మాత్రమే ఉండాలని కోరింది. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వేదిక అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి, నాయకులు జానకి రెడ్డి, ఓరుగంటి ఆనంద్, సుల్తాన్ యాదగిరి, సికింద్ర బేగం, అనిల్ కుమార్, కొమురయ్య, తదితరులు మాట్లాడారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వేయాలన్నారు.

అలాగే 250 గజాల ఇంటి స్థలం, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర సాధనలో ఉద్యమ కారుల త్యాగం మరువలేనిదని, ఎన్నో కష్టాలు, కేసులు, జైలు జీవి తం అనుభవించిన వారు నేడు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముం దుండాలని అన్నారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలను కూడా ఆదుకోవడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మోహన్ బైరాగి, లారా, గోశిక రవి, యాదగిరి, హరి, సుచరిత, సుజి తదితరులు పాల్గొన్నారు.