13 March, 2026 | 6:05 PM

పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్

13-03-2026 12:00 AM

మలక్‌పేట్, మార్చి 12 (విజయక్రాంతి): జోన్ పరిధిలోని అన్ని సర్కిలల్లో పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రోడ్లపై పేరుకుపోయిన మట్టి కుప్పలు, గృహ నిర్మాణాల వ్యర్ధాలతో పాటు మొత్తం 18.75 మెట్రిక్ టన్నుల మట్టి ని తొలగించామని జీహెచ్‌ఎంసీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్య క్రమంలో భాగంగా 7 వ రోజు సందర్భంగా గురువారం జోన్ పరిధిలోని మలక్పేట్, ముసారం బాగ్ సర్కిళ్ల లోని తిగలగూడ, ముసారం బాగ్, ప్రశాంత్ నగర్, ఓల్ మలక్ పేట్, సైదాబాద్ ఇతర ప్రాంతంలో జరుగుతున్న డెబ్రిస్ తొలగింపు పనులను జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి పలు విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఏ ఏం హెచ్ ఓ డాక్టర్ రుద్ర శ్రీనివాస్,ఇంజినీరింగ్ మరియు శానిటేషన్ డిఈలు నవీన్ కుమా ర్, రంజిత్ రెడ్డి, వెంకట్ రాజు, రాంకీ సంస్థ జోనల్ ఇంచార్జి నంద కిషోర్, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.