calender_icon.png 15 September, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల నిర్లక్ష్యంతో నిండుప్రాణం బలి

16-12-2024 01:01:23 AM

ఎమ్మెల్యే మాధవరం 

కూకట్‌పల్లి, డిసెంబర్ 15: జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ ఇందిర గాంధీపురంలో ఓ బాలు డు నాలాలో పడి చనిపోయిన ఘట నా స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ పండా ల సతీష్‌గౌడ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబానికి 20 వేల ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో కూల్చివేసిన నాలా గోడను కట్టకుండా వదిలేయడంతో మోజామిల్ అనే బాలుడు అందులో పడి మృతి చెందాడని, హుస్సేన్‌సాగర్‌లో డెడ్ లభించి నా అధికారులు కనీసం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నార న్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి, శ్రీహరి, డివిజన్ అధ్యక్షులు బిక్షపతి, గౌస్ పాల్గొన్నారు.