calender_icon.png 5 August, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డిలో కీచక ఉపాధ్యాయుడు

05-08-2025 01:24:05 AM

-6వ తరగతి బాలికపై లైంగిక వేధింపులు

-పాఠశాల ఎదుట బంధువుల ఆందోళన

- పోలీసుల అదుపులో నిందితుడు 

సంగారెడ్డి, ఆగస్టు 4 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడి లీలలు బయటపడ్డాయి. 6వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కుటుంబీకులు సోమవారం పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బాలికపై ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు.

దీంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ను నిలదీసినా పట్టింపులేని సమాధానం రావడంతో పెద్ద ఎత్తున కుటుంబీకులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. కాగా  సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.