calender_icon.png 5 August, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతగా పనిచేయండి

05-08-2025 01:23:53 AM

జిల్లా ఎస్పీ డి జానకి 

హన్వాడ ఆగస్టు 4 : ప్రజల విశ్వాసాన్ని రెట్టింపు చేసేలా పోలీసులు మరింత బాధ్యతగా పని చేయాలని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. సోమవారం హన్వాడ మండల పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ప్రత్యేకంగా పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు.

మీరు ఇక్కడ చేసిన పని విధానం చూసి ప్రజలు ఎల్లప్పుడూ మిమ్మల్ని చేసుకునేలా మీ విధానాలు ఉండాలని సూచించారు. శాంతి భద్రతలే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి సవిధానంగా సమాధానాలు చెబుతూ బాధ్యతగా విధులు నిర్వహించి ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే త్వరగా స్పందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ఉన్నారు.