22-12-2025 12:00:00 AM
ఆళ్ళపల్లి, డిసెంబర్ 21, (విజయక్రాంతి): మండల రాజకీయాల్లో పెను మార్పుకు నాంది మొదలైంది. డిసెంబర్ 17న జరిగిన స్థానిక ఎన్నికలలో అత్యధిక శాతం యువత సర్పంచులుగా వార్డు మెంబర్లుగా పోటీ చేయడమే కాక ప్రజా ఆమోదంతో సర్పంచులుగా వార్డు మెంబర్లుగా విజయకేతనం ఎగురవేయడంతో మండల ప్రజల్లో నూతన ఉత్సాహం మొదలైంది. మండల వ్యాప్తంగా 12 పంచాయితీలలో అత్యధిక శాతం సర్పంచ్ అభ్యర్థులుగా వివిధ పార్టీల నుండి పో టీ చేయడం ఆయా పార్టీలు కూడా యువతకే ప్రాధాన్యతను ఇవడం ప్రజలు కూడా వారిని స్వాగతించడంతో మండలంలో నూతన శకానికి నాంది మొదలైంది.
నూతనంగా ఎన్నికైన సర్పంచులు అంతా యువతే కావడం అత్యధికశాతం విద్యావంతులుగా ఉండటం గమనార్హం. ఎన్నికైన సర్పంచులు రాజకీయాలకతీతంగా గ్రామీణ అభివృద్ధికి దోహదపడతారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం యువత రాజకీయాల్లో అభ్యర్థులుగా పోటీ పడి సర్పంచులుగా వార్డ్ మెంబర్లుగా పాలకవర్గంగా ఎన్నిక కావడం మండలంలో ఇదే తొలిసారి కావడంతో సమాజ మార్పు మొదలైందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.