calender_icon.png 22 December, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నిరసన

22-12-2025 12:00:00 AM

ములకలపల్లి,డిసెంబర్ 21,(విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ పథకాన్ని రద్దు చేయడానికి, కూలీలకు పని దినాలు కల్పించే విషయంలో సవరణ లు తీసుకు వస్తున్న బిల్లును లోక్ సభలో ఆమోదించినందుకు నిరసనగా ఆదివారం ములకలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఆమోదించిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు,మాజీ జడ్పిటి సి సభ్యులు బత్తుల అంజి, కరుటూరి కృష్ణ, పువ్వాల మంగపతి,మేకల వెంకన్న, గాడి తిరుపతిరెడ్డి, సర్పంచి చంద్రకళ,అన్ని పంచాయతీల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పం చులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.