22-12-2025 05:56:02 PM
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల పరిధిలోని 28 గ్రామపంచాయతీలో ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్న నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ద్వారా ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు సోమ వారం ప్రమాణ స్వీకరాలు చేయించారు. వాంకిడి మేజర్ గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్, 6 వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ... అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.