22-12-2025 05:52:45 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని సోమవారం మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ప్రిన్సిపల్ సుకన్య మాట్లాడుతూ... ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణంలో గణితశాస్త్రం ముడిపడి ఉంటుందన్నారు. గణిత శాస్త్రంలో ఎన్నో సిద్ధాంతాలు, సూత్రాలు కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేసిన మేధావి శ్రీనివాస రామానుజన్ అని కొనియాడారు.ఆయన మన భారతీయుడు కావడం గర్వకారణమని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రాజెక్ట్ ను ఎక్స్పరిమెంట్ చేశారు.ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు, సిబ్బంది విద్యార్థినిలు పాల్గొన్నారు.