calender_icon.png 7 January, 2026 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేయూ బ్యాట్మింటన్ కెప్టెన్ గా మిమ్స్ విద్యార్థి

05-01-2026 05:45:15 PM

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : ఏపీలోని రాజమండ్రిలో గన్ని సుబ్బలక్ష్మి యూనివర్సిటీ ఈ నెల 6వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగే సౌత్ జోన్ బ్యాట్మింటన్ పోటీలకు కాకతీయ యూనివర్సిటీ నుంచి పాల్గొనే బ్యాట్మింటన్ జట్టు కెప్టెన్ గా మంచిర్యాల పట్టణంలోని మిమ్స్ కళాశాల విద్యార్థిని ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ రెడ్డి సోమ వారం తెలిపారు. MIMS dEGREE కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతున్న N. అశ్విత కాకతీయ యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైందని, కాకతీయ యూనివర్సిటీ జట్టుకు వరుసగా మూడవ సారి అశ్విత ఎంపికైందన్నారు. విద్యార్థినిని కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ రాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రావు, డైరెక్టర్ విజయ్ కుమార్, PD నూనె శ్రీనివాస్, అధ్యాపక బృందం అభినందించారు.