05-01-2026 05:28:37 PM
కవిత బాధ చూడలేక కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు
కూర్చున్న కొమ్మ నరుక్కునే ప్రయత్నం
హైదరాబాద్: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ఇష్టం లేకుంటే.. తెలంగాణ జాగృతిని భారత్ జాగృతిగా మీరెందుకు మార్చారు? అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత(Former BRS MLA Gongidi Sunitha) కవితను ప్రశ్నించారు. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ లో ఓడిపోతే మీ బాధ చూడలేక కేసీఆర్ పదవి ఇచ్చారని సునీత తెలిపారు.
పార్టీలో ప్రాధాన్యం లేకుండానే రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారా? అని సునీత ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను పార్టీ విస్మరించింది అనేది వాస్తవం కాదన్నారు. తెలంగాణ ఉద్యమ అమరులను స్మరించుకునేందుకే అమరవీరుల జ్యోతి నిర్మించారని తెలిపారు. రాజీనామా చేసిన తర్వాత మండలికి వెళ్లి మాట్లాడారు.. కంటతడి పెట్టారని విమర్శించారు. కవితను జైలు నుంచి తీసుకువచ్చేందుకు హరీశ్ రావు ఎంతో కృషి చేశారని చెప్పారు. కవిత కూర్చున్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కవిత ఎవరో ఆడించినట్లు ఆడుతున్నారని గొంగడి సునీత తెలిపారు. కేసీఆర్ ను విమర్శించి ఆమె భవిష్యత్ ను ఆమె నాశనం చేసుకున్నారని వివరించారు.